టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి
- ఈ ఉదయం మృతి చెందిన గోరంట్ల రాజేంద్ర ప్రసాద్
- అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన రాజేంద్ర ప్రసాద్
- ఆయన వయసు 86 సంవత్సరాలు
మూవీ మొఘల్, దివంగత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత 'మాధవి పిక్చర్స్' సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు. కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు ఆయన నిర్మించినవే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.