వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
- గీత రచయిత జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో హాజరుకానున్న కంగన
- సోమవారమే హాజరుకావాల్సి ఉన్నా మినహాయింపు కోరిన లాయర్
ఏమిటీ కేసు?
2020 నవంబర్ లో కంగనా రనౌత్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జావేద్ అక్తర్ పై ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ లో కొందరిని తొక్కివేసేందుకు ఓ కోటరీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆ కోటరీలో జావేద్ అక్తర్ భాగమంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు తన పరువుకు నష్టం కలిగించాయంటూ అదే నెలలో జావేద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది.