ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్
- మంత్రి మేకపాటి హఠాన్మరణంతో ఉప ఎన్నిక
- పోటీలో మేకపాటి సోదరుడు విక్రంరెడ్డి
- సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- 26న ఫలితం వెల్లడి
మొత్తం 2,13,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనుండగా, వీరి కోసం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 131 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడిస్తారు.