రజనీ 169వ సినిమా టైటిల్ ఇదే!
- రజనీ 169వ సినిమాకి సన్నాహాలు
- కొంతసేవటి క్రితమే టైటిల్ రివీల్
- 'జైలర్' టైటిల్ ఖరారు చేసిన మేకర్స్
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
అయితే ఆ పుకార్లకు తెరదించేస్తూ మేకర్స్ అసలు టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకి 'జైలర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రక్తసిక్తమైన వ్రేలాడ దీసిన కత్తిని పోస్టర్ లో చూపించారు. దీనిని బట్టే ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ మధ్య కాలంలో రజనీ సినిమా .. సినిమాకి తప్పనిసరిగా లుక్ మార్చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఆయనను నెల్సన్ మరింత స్టైలీష్ గా చూపించనున్నాడని సమాచారం. కథానాయికగా ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.