విక్కీపై చేయి వేసి ఫొటో దిగిన ఫరాఖాన్.. కత్రినాను ఉడికించేలా ట్వీట్
- కత్రినా సారీ.. అతడు మరొకర్ని గుర్తించాడంటూ పోస్ట్
- మీకు అనుమతి ఉందంటూ కత్రినా రిప్లయ్
- తాము మంచి స్నేహితులమంటూ విక్కీ కౌశల్ వివరణ
ఈ ఫొటోను ఫరాఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘సారీ కత్రినా కైఫ్.. అతడు మరొకరిని గుర్తించాడు’’అంటూ కత్రినా కైఫ్ ఉడికిపోయేలా పోస్ట్ పెట్టింది. నాలుక బయటకు వచ్చిన ఎమోజీ వేసింది. దీనికి కత్రినా మామూలుగా స్పందించింది. ‘‘మీకు అనుమతి ఉంది ఫరాఖాన్ కుందర్’’అంటూ కత్రినా స్పందించింది. కత్రినా పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో షారూక్ ఖాన్ నటించిన కల్ హో నా హో సినిమాలోని కుచ్ తో హువా హై పాట వినిపిస్తోంది.
ఇక వీరిద్దరి మధ్యలోకి విక్కీ కౌశల్ కూడా దూరిపోయాడు. సదరు ఫొటోను తన ఖాతాలో షేర్ చేస్తూ ‘‘మేము కేవలం మంచి స్నేహితులం’’అని వివరణ ఇస్తూ ముగింపు పలికాడు. కొంతకాలం పాటు సహజీవనం చేసిన తర్వాత 2021 డిసెంబర్ లో కత్రినా, కౌశల్ వివాహం చేసుకోవడం తెలిసిందే.