అమరావతి భజనతో టీడీపీ దెబ్బతిన్నది: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్
- అమరావతి వ్యతిరేక నినాదంతో వైసీపీ ముందుకెళుతోందన్న టీజీ
- అమరావతి వ్యతిరేక వాదమే వైసీపీ నినాదమని వ్యాఖ్య
- కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగ్గా వినియోగించుకోవట్లేదన్న టీజీ
అమరావతి భజనతో టీడీపీ ఇతర ప్రాంతాల్లో దెబ్బతిన్నదని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. అదే సమయంలో అమరావతి వ్యతిరేక నినాదంతో వైసీపీ ముందుకు వెళుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నినాదం రాష్ట్రాభివృద్ధి కాదన్న టీజీ.. అమరావతి వ్యతిరేక వాదమే ఆ పార్టీ నినాదంగా మారిందన్నారు. కేంద్ర నిధులు, పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని టీజీ వెంకటేశ్ ఆరోపించారు.