ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'విరాటపర్వం'... కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
- రానా, సాయిపల్లవి జంటగా విరాటపర్వం
- వేణు ఉడుగుల దర్శకత్వంలో చిత్రం
- ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా
- తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఖరారు
- జూన్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్
ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో, చిత్రబృందం విడుదల తేదీని నిర్ధారించింది. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత.
దగ్గుబాటి సురేశ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. విరాటపర్వం చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.