ఈ నెల 21న శిల్పకళావేదికలో 'ఎఫ్3' ప్రీ రిలీజ్ వేడుక
- వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం
- ఈ నెల 27న ఎఫ్3 రిలీజ్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రకటన చేసిన చిత్రబృందం
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబోలో వస్తున్న ఎఫ్3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి వెంకీ, వరుణ్ లకు కామెడీ కింగ్ సునీల్ కూడా తోడవడంతో వినోదం ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
.