సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'
- మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట
- ఈ నెల 12న రిలీజ్
- నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
సర్కారు వారి పాట చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి. తమన్ మ్యూజిక్ కు మహేశ్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. కళావతి, పెన్నీ పాటలు సోషల్ మీడియాను ఊపేయడం తెలిసిందే.