మోదీపై ప్రశంసలు.. చిదంబరంపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
- ఉగ్రవాదుల గుండెల్లో మోదీ రైళ్లు పరిగెత్తించారు
- పాకిస్థాన్ గడ్డపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఘనత మోదీది
- నాపైనా, జగన్ పైనా చిదంబరం, అజాద్ తప్పుడు కేసులు పెట్టించారన్న విజయసాయి
కాంగ్రెస్ నేతలు చిదంబరం, గులాం నబీ అజాద్... తనపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దేశంలో జరిగిన టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవేనని అన్నారు. సభను తప్పుదోవ పట్టించేలా చిదంబరం మాట్లాడుతున్నారని... చిదంబరం చెప్పేవి నీతులు, చేసేవి తప్పుడు పనులని విజయసాయి విమర్శించారు.