'విక్రమ్' భారీతనాన్ని పెంచుతున్న కమల్!
- 'విక్రమ్'గా కమలహాసన్
- కీలకమైన పాత్రలో అమితాబ్
- దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్
- జూన్ 3వ తేదీన వివిధ భాషల్లో రిలీజ్
అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టీమ్ సస్పెన్స్ లో ఉంచిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.
ఇంతవరకూ కమల్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు. జూన్ 3 వ తేదీన తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కమల్ మరోసారి భారీ హిట్ అందుకుంటారేమో చూడాలి.