అర్జున్ 'జెంటిల్ మేన్'కి సీక్వెల్ .. హీరోయిన్ గా నయనతార!
- 1993లో వచ్చిన 'జెంటిల్ మేన్'
- సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా
- మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ టాక్
- సంగీత దర్శకుడిగా కీరవాణి?
ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా మ్యుజికల్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేశారుగానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆ సినిమా సీక్వెల్ విషయం తెరపైకి వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ తీయడానికి కుంజుమోన్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.
కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా కీరవాణితో మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఈ టాక్ వినిపిస్తోంది. శంకర్ ఇప్పట్లో తీరిక చేసుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో దర్శకుడిగా ఆయనే ఉంటాడా? లేదంటే వేరే డైరెక్టర్ ను ఎంపిక చేసుకుంటారా? అనేది చూడాలి.