సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తుడిపై పూజారి దాడి... వీడియో ఇదిగో!
- దైవదర్శనానికి వచ్చిన ఉప్పల్ భక్తుడు
- ఉప ఆలయాల సందర్శనకు యత్నం
- అడ్డుకున్న పూజారి
- అనుమతి లేదంటూ ఆగ్రహం
అంతేకాదు, ఆ భక్తుడిపై దాడి చేయగా, ఈ భక్తుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ గణపతి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ఈ ఘటనపై సదరు భక్తుడు పూజారి ప్రభాకర్ శర్మపై ఆలయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. పూజారి ప్రవర్తనపై దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ ఘటన రెండ్రోజుల కింద జరిగినట్టు తెలుస్తోంది.