పునీత్ రాజ్‌కుమార్ పేరిట ఉపగ్రహం: కన్నడ ఐటీ మంత్రి
- పునీత్ స్మారకార్థం ఉపగ్రహ తయారీకి శ్రీకారం
- రూ. 1.90 కోట్లతో ఒక కిలో బరువైన శాటిలైట్
- ఉపగ్రహాన్ని రూపొందించనున్న బెంగళూరుకు చెందిన విద్యార్థులు
బెంగళూరులోని ప్రముఖ పీయూ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపగ్రహ తయారీ కోసం ప్రభుత్వం తరపున రూ. 1.90 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరుకు చెందిన విద్యార్థుల ద్వారానే విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. సాధారణంగా 50 కిలోల శాటిలైట్ ను రూపొందించేందుకు రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కిలో బరువున్న శాటిలైట్ ను విద్యార్థులు రూ. 1.90 కోట్లతో రూపొందిస్తారని తెలిపారు. 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారని చెప్పారు.