'పుష్ప 2' కోసం లొకేషన్ల వేటలో సుకుమార్!
- సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
- బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లు
- సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు
- కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్
'పుష్ప' సినిమా బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది కనుక, ఈ సారి ఉత్తరాది లొకేషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను కూడా కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ కారణంగా బాలీవుడ్ ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువని భావిస్తున్నారు.
ఇక 'పుష్ప'లో స్మగ్లర్ గా ఎదుగుతూ కనిపించిన హీరో .. సెకండ్ పార్టులో స్మగ్లర్స్ కి పెద్ద తలకాయలా మారిపోయి, అందరినీ శాసించే స్థాయిలో కనిపిస్తాడట. ఆయన భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది. అందుకు తగినట్టుగానే పాటలు . ఫైట్లు ఉంటాయని చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట.