సినీ నటుడు నరేశ్ మాజీ భార్యపై కేసు నమోదు
- నరేశ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తోందంటూ ఐదుగురు మహిళల ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
- రమ్యతో తనకు సంబంధం లేదన్న నరేశ్
నరేశ్ కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఆమె. ఎనిమిదేళ్ల క్రితం ఆమెను నరేశ్ పెళ్లాడారు. అయితే తర్వాత ఆమె నుంచి ఆయన విడిపోయారు. నరేశ్ కు చెందిన ఆస్తులను చూపుతూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని చెపుతూ, చాలా మంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు. మరోవైపు దీనిపై నరేశ్ స్పందిస్తూ రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.