ఎన్టీఆర్ .. అలియా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!
- రిలీజ్ కి రెడీగా 'ఆర్ ఆర్ ఆర్'
- కొరటాలతో సినిమాకి సన్నాహాలు
- కథానాయికగా అలియా భట్
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
- ఏప్రిల్ ఫస్టు వీక్ నుంచి షూటింగ్
గతంలో కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. అందువలన సహజంగానే తాజా ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి అలియా భట్ ను ఎంపిక చేశారు .. ఆమె కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ లోగా ఇతర నటీనటుల ఎంపికను .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.