గోపీచంద్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న రాజశేఖర్?
- విలన్ పాత్రల పట్ల రాజశేఖర్ ఆసక్తి
- గోపీచంద్ మూవీలో పవర్ఫుల్ విలన్ రోల్
- శ్రీవాస్ దర్శకత్వంలో సెట్స్ పైకి
- రాజశేఖర్ ప్లేస్ లో జగపతిబాబు?
ఈ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారని అంటున్నారు. కారణమేమిటనేది తెలియదుగానీ, ఈ వార్త మాత్రం జోరుగానే వినిపిస్తోంది.
గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'లౌక్యం' తరువాత శ్రీవాస్ చేస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు కావడం వలన, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకోవడం వలన, జగపతిబాబును తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.