కోలీవుడ్ కి వెళుతున్న 'అఖండ' డబ్బింగ్
- సంచలన విజయాన్ని సాధించిన 'అఖండ'
- రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ
- 'అఘోర' పాత్ర పట్ల స్టార్ హీరోల ఉత్సాహం
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో
ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. తమిళంలోకి డబ్ చేసి .. అక్కడ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అక్కడ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
బాలకృష్ణ - ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. తమన్ స్వరపరిచిన పాటలకు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. కథాకథనాల లోని బలం కారణంగా ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.