కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ!
- 'దొరసాని'తో తెలుగు తెరకి పరిచయం
- ఆకట్టుకోని తదుపరి సినిమాలు
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'హైవే'
- ట్రయాంగిల్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్
ఆ తరువాత చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మాత్రం, సినిమాకి సరిపడే కంటెంట్ కాదనే విమర్శలను మూటగట్టుకుంది. ఇక 'పుష్పక విమానం' సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ ఎందుకనో రిలీజ్ కి ముందుగానీ .. ఆ తరువాత గాని ఎవరూ కూడా ఆ సినిమాను గురించి మాట్లాడుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి రావడానికి 'హైవే' సినిమా రెడీ అవుతోంది.
కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా, కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయమవుతోంది. ఇక ఆ తరువాత ఆయన ఒక కొత్త దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'కలర్ ఫొటో' సినిమాకి రచయితగా పనిచేసిన సాయిరాజేశ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎస్ కేఎన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.