'అట్టా సూడకే' అంటూ స్టెప్పులు అదరగొట్టిన రవితేజ!
- 'ఖిలాడి'గా రవితేజ
- దర్శకుడిగా రమేశ్ వర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- ఫిబ్రవరి 11వ తీదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బీట్ బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది.
సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. మాస్ ఆడియన్స్ కి వెంటనే పట్టేసే తేలికైన పదాలతో విన్యాసాలు చేయించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అదరగొట్టేశాడు.