కానిచ్చేద్దాం అంటున్న మహేశ్ బాబు!
- దుబాయ్ లో రెస్టు తీసుకుంటున్న మహేశ్
- ముగింపు దశలో 'సర్కారువారి పాట'
- వచ్చే నెలలో మళ్లీ సెట్స్ పైకి
- ఏప్రిల్ 1వ తేదీన విడుదల
అయితే, మహేశ్ బాబు మోకాలు సర్జరీ కారణంగా ఈ సినిమా షూటింగు గత కొంతకాలంగా వాయిదా పడింది. మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజానికి ఫిబ్రవరి నుంచి మళ్లీ షూటింగు మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ జనవరి నుంచి మొదలుపెట్టేద్దాం అని మహేశ్ నిర్మాతలతో తాజాగా అన్నట్టు తెలుస్తోంది. సో... వచ్చేనెల నుంచే మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బ్యాంకు స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మహేశ్ - వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి వచ్చేనెల ఫస్టు వీక్ లో ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.