'బలం' టైటిల్ తో రంగంలోకి అజిత్ 'వలిమై'
- అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
- కథానాయికగా హుమా ఖురేషి
- ప్రతినాయకుడిగా కార్తికేయ
- జనవరి 13వ తేదీన విడుదల
ఈ సినిమాకి తెలుగులో 'బలం' అనే టైటిల్ ను నిర్ణయించారు. తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదలనున్నట్టుగా తెలుస్తోంది.
బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా ఆయనకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.