నిర్మాతల సమస్యలు వేరు, ఏపీలో ఎగ్జిబిటర్ల సమస్యలు వేరు: దిల్ రాజు
- త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తామన్న దిల్ రాజు
- ఇండస్ట్రీ తరఫున కమిటీ వేశామని వెల్లడి
- చిత్ర పరిశ్రమ పెద్దలు కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరణ
- సినిమా వాళ్లు ఈ అంశాలపై మాట్లాడొద్దన్న దిల్ రాజు
త్వరలోనే సీఎం జగన్ ను, మంత్రులను కలిసి చర్చిస్తామని వెల్లడించారు. అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నామని అన్నారు. సినీ రంగ సమస్యలను సీఎం జగన్ కు నివేదించేందుకు చిత్ర పరిశ్రమ తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీలో ఇండస్ట్రీ పెద్దలు సభ్యులుగా ఉంటారని వివరించారు.
ఏపీ ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరపనున్నందున సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ ఆయా అంశాలపై మాట్లాడొద్దని దిల్ రాజ్ స్పష్టం చేశారు. మీడియా కూడా సంయమనం పాటిస్తూ తమకు సహకరించాలని కోరారు.