'పుష్ప' చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి... సుకుమార్ కు అభినందనలు
- ఈ నెల 17న 'పుష్ప ది రైజ్' విడుదల
- బాక్సాఫీసు వద్ద వసూళ్ల హవా
- 'పుష్ప' చిత్రాన్ని ఎంజాయ్ చేసిన చిరంజీవి
- బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ కితాబు
కాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా 'పుష్ప' చిత్రాన్ని వీక్షించారు. 'పుష్ప' చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. 'పుష్ప ది రైజ్' చిత్రంలోని ప్రతి ఘట్టాన్ని చిరంజీవి ఎంతో ఆస్వాదించారని తెలిపింది. దర్శకుడు సుకుమార్ ను చిరంజీవి అభినందించారని, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ కొనియాడారని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.