తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'పుష్ప' టీమ్
- వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం
- రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాల స్వీకరణ
- సినిమా విజయం సాధించిన నేపథ్యంలో వచ్చామన్న యూనిట్
- పార్ట్-2 నిర్మాణాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షురూ చేస్తామని వ్యాఖ్య
ఈ సినిమా పార్ట్-2 నిర్మాణాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత రాత్రి తిరుపతిలో ఈ సినిమా సక్సెస్ పార్టీని నిర్వహించారు.