భార్యాభర్తలుగా మారిన కత్రిన, విక్కీ.. ఫొటో లీక్!
- వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ప్రేమ జంట
- అతికొద్ది మంది సమక్షంలో వైభవంగా వివాహం
- సబ్యసాచి లెహంగాలో మెరిసిపోతున్న కత్రిన
పెళ్లి తర్వాత అందరి ఆశీస్సులు తీసుకుని వస్తున్న జంట ఫొటోను ఎవరో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కత్రిన సబ్యసాచి లెహంగాలో మెరిసిపోతుండగా... విక్కీ క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో ఉన్నాడు. ఈ ఫొటో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త జంటకు నెటిజెన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.