పరవాడ ఫార్మా సిటీలో మరోమారు గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి
- వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో ఘటన
- పాయకరావుపేటకు చెందిన యువకుల మృతి
- విశాఖలో సర్వసాధారణంగా మారిన గ్యాస్ లీక్ ఘటనలు
గతేడాది మేలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోగా, చుట్టుపక్కల ఉన్న వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందలాదిమంది కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. తాజా ఘటన విశాఖ వాసులను మరోమారు ఆందోళనకు గురిచేసింది.