'స్కైల్యాబ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- సత్యదేవ్ హీరోగా 'స్కైల్యాబ్'
- కథానాయికగా నిత్యామీనన్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- డిసెంబర్ 4వ తేదీన రిలీజ్
"రారా లింగా రారా లింగా .. కథ చెబుతా కచ్చితంగా, రారా లింగా రామాలింగా ఇనుకోరా సుబ్బరంగా. పైకి సూత్తే ఎంతో సురుకు .. లోన మాత్రం లేదు సరుకు .. ఊరుమొత్తం ఇంతేనయ్యో తళుకు బెళుకు" అంటూ ఈ పాట సాగుతోంది. సానపాటి భరద్వాజ్ పాత్రో సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సీన్ రోల్డన్ ఆలపించాడు.
రాహుల్ రామకృష్ణ .. తులసి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. కొంత గ్యాప్ తరువాత నిత్యామీనన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక ఇదే నెల 10వ తేదీన వస్తున్న 'గమనం' సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.