మెగాస్టార్ నా పెళ్లికి వచ్చారు.. చిన్నప్పటి మాట నిజమైంది: కార్తికేయ
- హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ
- ఇటీవలే వైభవంగా జరిగిన వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్
- తన లైఫ్ లో మరిచిపోలేనన్న కార్తికేయ
అలాంటి కార్తికేయ ఈ నెల 21వ తేదీన వివాహం చేసుకున్నాడు. కాలేజ్ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడుతున్నట్టుగా చెప్పాడు. ఈ వివాహానికి చిరంజీవికి కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సందర్భంలోని ఒక ఫొటోను కార్తికేయ అభిమానులతో పంచుకున్నాడు.
చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. "నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడు" అనే వాడినట. విధి చాలా చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు అది" అని చెప్పుకొచ్చాడు.