సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజతో ఈషా స్పెషల్ సాంగ్
- ఓటీటీకి వస్తున్న అఖిల్ సినిమా
- 'స్కైల్యాబ్' విడుదలకు డేట్ ఖరారు
* అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి డేట్ నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీ లలో ఈ నెల 19 నుంచి దీనిని స్ట్రీమింగ్ చేస్తారు.
* నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన 'స్కైల్యాబ్' చిత్రాన్ని డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. నూతన దర్శకుడు విష్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో అలజడి రేపిన అమెరికా స్పెస్ ష్టేషన్ 'స్కైల్యాబ్' నేపథ్యంలో రూపొందింది.