'పుష్ప' నుంచి అనసూయ మాస్ లుక్!
- ముగింపు దశలో 'పుష్ప'
- దాక్షాయణి పాత్రలో అనసూయ
- నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర
- డిసెంబర్ 17వ తేదీన విడుదల
ఇక రీసెంట్ గా 'మంగళం శ్రీను' పాత్రలో సునీల్ ను పరిచయం చేస్తూ ఆయన లుక్ ను రివీల్ చేశారు. సునీల్ ను ఆ తరహా లుక్ తో ఊహించని నెటిజన్లు షాక్ అయ్యారు. సునీల్ పాత్ర ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి 'దాక్షాయణి' పాత్రలో అనసూయను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను వదిలారు.
ఈ పోస్టర్లో అనసూయ మాస్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె లుక్స్ ను బట్టి ఆమె పోషించినది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అనిపిస్తోంది. మరి ఈ లుక్ తో తెరపై ఆమె ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో చూడాలి. 'రంగస్థలం'లో అందమైన రంగమ్మత్తగా ఆమెను చూసిన ప్రేక్షకులకు, ఆమెను ఇలా చూడటం మరింత కొత్తగా అనిపిస్తుంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.