ఆ సంఘటనే నన్ను మెగాస్టార్ కి దూరం చేసింది: కోటి
- చిరంజీవిగారి 12 సినిమాలకి పనిచేశాను
- ఒంగోలులో ఆ సినిమా ఫంక్షన్ జరిగింది
- ఫీవర్ కారణంగా వెళ్లలేకపోయాను
- నాపై ఎవరో ఏదో కల్పించి ఆయనకి చెప్పారన్న కోటి
"చిరంజీవిగారి 12 సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను. ఒక సినిమా 100డేస్ ఫంక్షన్ ను ఒంగోలులో నిర్వహించారు. అక్కడికి దగ్గరలోనే మా అత్తగారి ఊరు. అందువలన ముందురోజునే అక్కడికి చేరుకున్నాను. కానీ హఠాత్తుగా హై ఫీవర్ రావడంతో నేను ఆ ఫంక్షన్ కి వెళ్లలేకపోయాను.
అయితే, కావాలనే నేను ఆ ఫంక్షన్ కి రాలేదని కొంతమంది చిరంజీవిగారికి చెప్పారు. ఆ తరువాత అసలు విషయం ఆయనకి చెప్పడానికి వెళితే, ఆయన మాట్లాడే మూడ్ లో లేరని అన్నారు. ఆయన అలా రియాక్ట్ కావడంలో తప్పులేదనిపించింది. దాంతో వెనక్కి తిరిగి వచ్చేశాను. అలా ఆ సినిమా ఫంక్షన్ ఆయనకి నన్ను దూరం చేసింది" అని చెప్పుకొచ్చారు.