సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మలయాళం రీమేక్ లో అంజలి
- బాలకృష్ణ షోలో ప్రభాస్, ఎన్టీఆర్
- చరణ్, కియారాలపై పూణేలో పాట
* నందమూరి బాలకృష్ణ తొలిసారిగా 'అన్ స్టాపబుల్' పేరిట 'ఆహా' ఓటీటీ కోసం ఓ షోను హోస్ట్ చేస్తున్న సంగతి విదితమే. దీపావళి రోజున స్ట్రీమింగ్ అయ్యే తొలి ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు మోహన్ బాబు అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత ఎపిసోడ్లలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా అతిథులుగా వస్తున్నట్టు సమాచారం.
* రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ గత నెల 22 నుంచి పూణేలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఇప్పటికే ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించగా, ప్రస్తుతం చరణ్, కియారా అద్వానీలపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. రేపటితో ఈ షెడ్యూలు పూర్తవుతుంది.
* రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అనుభవించు రాజా' చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో కశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.