'మంగళవారం మరదలు' వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ
- ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష
- మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
- మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
- తాను ఎవరి పేరును ఉపయోగించలేదని మంత్రి వివరణ
అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు.