మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల
- నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం షర్మిల దీక్ష
- మంగళవారం మరదలు అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఇలాంటి కుక్కలను తరిమికొట్టే రోజు వస్తుందన్న షర్మిల
మంత్రి వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. చందమామను చూసి శునకాలు మొరగడం సాధారణమైన విషయమేనని అన్నారు. టీఆర్ఎస్ మంత్రులు శునకాల్లా మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కుక్కలను తరిమికొట్టడం ఖాయమని, ఆ రోజు మరెంతో దూరంలో లేదని పేర్కొన్నారు.
కాగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి కూడా మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంజన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, ఇదే ధోరణి కొనసాగిస్తే చీపుర్లు తిరగేసి కొడతామని హెచ్చరించారు.