రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన కీర్తి సురేశ్
- దక్షిణాదిన ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేశ్
- టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న కీర్తి
- 'దసరా' చిత్రానికి రూ. 3 కోట్లు తీసుకున్న కీర్తి
'దసరా' చిత్రానికి కీర్తి ఏకంగా రూ. 3 కోట్లు వసూలు చేసిందని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవేంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.