దేవుడు కలలోకి వచ్చి ఏం కావాలన్నాడు... 'మా' సభ్యుల సంక్షేమం కోరుకుని పోటీ నుంచి తప్పుకున్నా!: సీవీఎల్
- 'మా' ఎన్నికల వ్యవహారం
- ఇటీవల పోటీ నుంచి విరమించుకున్న సీవీఎల్
- నేడు ప్రెస్ మీట్
- తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టీకరణ
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. 'మా' ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే, మా భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని, ఆ వ్యక్తి ఎవరన్నది 'మా' నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం రోజున వెల్లడిస్తానని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రస్తుతం ఇస్తున్న పింఛను రూ.6 వేలకు మరో రూ.4 వేలు కలిపి ఇచ్చేందుకు కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆ దాతలు నటులు కాదని అన్నారు. ఇక, మురళీమోహన్ తీసుకువచ్చిన తీర్మానాన్ని తప్పక అమలు చేయాలని సీవీఎల్ కోరారు.