నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్
- సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన అనుపమ
- బికినీతో ఉన్న ఫొటో షేర్ చేయాలన్న ఒక నెటిజన్
- అడ్రస్ పంపు అంటూ సమాధానమిచ్చిన అనుపమ
తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె ఓపికగా, ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చింది. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెకు చిరాకు కలిగించాడు. బికినీ ధరించిన ఫొటోను షేర్ చేయాలని ఆమెను కోరాడు. దీంతో అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 'నీ అడ్రస్ పంపు... ఆ అడ్రస్ కు ఫొటో పంపుతా... ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో' అంటూ ఘాటుగా అనుపమ సమాధానమిచ్చింది.