ఆసక్తిని పెంచిన 'కిన్నెరసాని' లిరికల్ సాంగ్!
- కల్యాణ్ దేవ్ హీరోగా 'కిన్నెరసాని'
- దర్శకుడిగా రమణ తేజ్
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
'దారికాని దారిలోన .. 'అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ అందించిన బాణీకి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించాడు. జాతర పాట తరహాలో ఈ పాట సాగింది. ఈ పాట బీట్ బాగానే ఉన్నప్పటికీ .. సాహిత్యం పరంగా చూసుకుంటే, అర్థం చేసుకోవడానికి కొంతసేపు ఆలోచన చేయవలసి వస్తుంది.
'పార్వతీపురం' అనే ఊరు తనని తాను పరిచయం చేసుకుంటూనే కథలోకి వెళుతుంది. అయితే అందుకోసం వాడిన పదాలు పెద్దగా తెలిసినవి కాకపోవడం అయోమయాన్ని కలిగిస్తుంది. ఏదేవైనా ఈ పాటతో ఈ సినిమాలో మరో కోణం ఉందనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.