టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 7 గంటలపాటు సాగిన తరుణ్ విచారణ
- బుధవారం ఉదయం విచారణకు హాజరైన హీరో తరుణ్
- డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నలు
- మనీలాండరింగ్ కోణంలోనూ సాగిన విచారణ
మొత్తం 12 మందిలో ఇప్పటికే 11 మంది ఈడీ విచారణకు హాజరయ్యారు. వీరిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఈ జాబితాలో చివరి వ్యక్తిగా ఈడీ విచారణకు తరుణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో తరుణ్‌కు ఉన్న సంబంధంపై అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అలాగే మనీలాండరింగ్ కోణంలో కూడా ప్రశ్నించిన అధికారులు.. అనుమానాస్పదంగా ఉన్న బ్యాంకు లావాదేవీలపై తరుణ్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది.