డేనియల్ శేఖర్ వచ్చేశాడు.... 'భీమ్లానాయక్' నుంచి తాజా టీజర్ విడుదల
- మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్
- తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్
- భీమ్లా నాయక్ గా పవన్ కల్యాణ్
- డేనియల్ శేఖర్ గా రానా
- సాగర్ కె చంద్ర డైరెక్షన్
మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని తెలుగులో సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చుతుండడం విశేషం. పవన్ కల్యాణ్ ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీసాఫీసర్ గా నటిస్తుండగా, డేనియల్ శేఖర్ అనే రౌడీగా రానా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.