ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. నగరంలో భక్తుల కోలాహలం
- నగరంలో కోలాహలంగా ప్రారంభమైన గణేశుల ఊరేగింపు
- 17 కి.మీ. మేర కొనసాగనున్న మహాగణపతి శోభాయాత్ర
- ట్రాఫిక్ మళ్లింపు.. భద్రత కట్టుదిట్టం
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు కూడా ఈ ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం బాలాపూర్ చౌరస్తాలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. కాగా, నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులకు జీహెచ్ఎంసీ మాస్కులు పంపిణీ చేస్తోంది.