కొత్త దర్శకుడితో నాని కొత్త చిత్రం!
- రిలీజ్ కి రెడీగా 'శ్యామ్ సింగ రాయ్'
- షూటింగు దశలో 'అంటే సుందరానికీ'
- సుకుమార్ శిష్యుడికి ఛాన్స్
- పరిశీలనలో 'దసరా' టైటిల్
ఆ తరువాత సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని చేయనున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఇటీవల నానీకి ఒక కథను వినిపించాడట. కథ బాగుండటంతో వెంటనే నాని ఓకే చేప్పాడని అంటున్నారు. తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమాకి 'దసరా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ దసరాకి ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.