డ్రగ్స్ కేసు: విచారణకు వచ్చిన సినీ నటుడు నవదీప్
- డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ
- కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు
- నవదీప్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల పరిశీలన
ఇదే కేసులో నోటీసులు అందుకున్న సినీనటుడు నవదీప్ ఈ రోజు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు. మూడు రోజుల విరామం అనంతరం ఈడీ అధికారులు ఈ కేసులో మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. గత 10 రోజులుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
రోజుకి ఒకరిని కార్యాలయానికి పిలిచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారించనున్నారు. నవదీప్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే, డ్రగ్స్ సరఫరాదారులతో ఆయనకు ఉన్న సంబంధాలు, అతడితో జరిపిన సంప్రదింపులపై ఆరా తీస్తున్నారు.