సాయితేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి
- సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది
- అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాం
- ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తాం
నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మరోవైపు రోడ్డుపై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయిందని అంటున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.