సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'ఉప్పెన' భామకు మరో బిగ్ ఆఫర్
- యూకేకు వెళుతున్న ప్రభాస్
- 'మా' ఎన్నికల బరిలో బాబూమోహన్
* పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న 'ఆదిపురుష్' షూటింగులో పాల్గొంటున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ వివిధ దశలలో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడట. ఈ మేకోవర్ కోసం అంతర్జాతీయ డైటీషియన్ల సలహాలు తీసుకోవడానికి త్వరలో ఆయన యూకేకు వెళుతున్నట్టు సమాచారం.
* మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా'కు త్వరలో ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. దీంతో అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో ప్రముఖ హాస్య నటుడు బాబూమోహన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కూడా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు చెబుతున్నారు.