'ఖిలాడి' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!
- రమేశ్ వర్మ నుంచి 'ఖిలాడి'
- రవితేజ జోడీగా ఇద్దరు భామలు
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
'చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం' అంటూ ఈ పాట సాగుతోంది. రవితేజ - డింపుల్ పై చిత్రీకరించిన ఈ పాట బీట్ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన .. శ్రీమణి అందించిన సాహిత్యం .. హరిప్రియ ఆలాపన మనసుకు పట్టుకుంటున్నాయి. హీరో పట్ల తన మనసులోని భావాలను హీరోయిన్ ఆవిష్కరించే తీరు కొత్తగా .. ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.