ముగిసిన రవితేజ ఈడీ విచారణ.. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన విచారణ
- సాయంత్రం 4 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రవితేజ
- బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించిన అధికారులు
- విచారణకు సహకరిస్తానన్న రవితేజ
ఇక సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ... ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా రవితేజ హామీ ఇచ్చారు.