డ్రగ్స్ కేసులో విచారణకు వచ్చిన హీరో రవితేజ, ఆయన డ్రైవర్
- లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ
- కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలు
- కెల్విన్ నుంచి రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌కు డ్రగ్స్
- శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు
నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ అధికారుల ముందు రవితేజ కూడా విచారణకు హాజరయ్యారు. అంతేగాక, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యాడు. కెల్విన్ నుంచి శ్రీనివాస్‌కు డ్రగ్స్ అందాయని ఈడీ దృష్టికి వచ్చింది. శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారించనున్నారు.
రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కెల్విన్ తో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలు, అతడితో జరిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ రోజు కెల్విన్ మరోసారి విచారణకు హాజరుకానున్నాడు.